-
నీ ప్రశ్నలు నీవే
This post is also available in English నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటే కలిగేది ఆనందమా…నిన్ను నువ్వు మోసం చేసుకుంటే కలిగేది చైతన్యమా…సమస్యలకు ఆటంకాలకు భయపడటమే ప్రతిస్పందనా… నువ్వు మెచ్చి ఎంచుకున్న మార్గం లో నడవటానికి భయమెందుకుదారిలో ముళ్లు ఉంటాయనా, ఉన్నాయనా…కొత్త మార్గం నిర్మించాలంటే …దారిని శుభ్రం చేయవలసిందే… భయాగ్ని లో నిన్ను నువ్వు దహించుకోకు…దానిని జ్యోతి లాగా మార్చి ముందుకు చూడు…సత్యాసత్యాలలో… శాంతి సంతోషాలు లేవు…సత్యాసత్యాలు భౌతికాంశాలు… కేవలం నిన్ను నడిపించే ఇంధనాలు మాత్రమే…శాంతి…
-
కర్ణుడి దాతృత్వం
కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు, అర్జునుడు తన ధర్మ రథంలో శ్రీకృష్ణునితో పాటు ప్రయాణిస్తున్నాడు. తన దానగుణం పట్ల గర్వపడుతున్న అర్జునుడు, “కృష్ణా, ఈ భూమండలంలో అత్యంత దాత ఎవరు?” అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, “అర్జునా, అది కర్ణుడు” అని సమాధానమిచ్చాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. “కర్ణుడా? అతను కాదు, నేనే అత్యంత దాతను” అని అన్నాడు. అర్జునుడి సందేహాన్ని నివృత్తి చేయడానికి, శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో రెండు బంగారు పర్వతాలను సృష్టించాడు. “అర్జునా, ఈ బంగారు పర్వతాన్ని…
-
సంచారి
మలచలేక నలిగిపోయినలగలేక వడలిపోయి వడలలేక వాలిపోయి వాలిపోయి నిదురపోయే చెప్పలేక మూగపోయి చూడలేక పారిపోయి పారిపోయి అలిసిపోయిఅలిసిపోయి నిదురపోయే నేటి నుండి నిదురలోకి నిదురలోంచి కలలలోకి కలలలోంచి కాంక్షలోకి కాంక్షలోంచి రేపటిలోకి రోజులు తిరిగే సంచారిరేపటి కి దారి నేటి నుంచే
-
స్నేహామృతం
గెలుపు లో ఓటమి లో కష్టం లో సుఖం లో దుఃఖం లో యుద్దం లో తోడున్న జతగాడా నీకు నేను ఏమీ ఇవ్వగలను నా స్నేహం తప్ప!
-
నిన్న నేడు రేపు!
జీవన చదరంగం లో రాజునై, మంత్రినై, బంటునైసర్వపాత్రాభినయం చేసిందిరేపటి గెలుపు కోసంనిన్నటి బాధలునేటి అవమానాలుమోసిన బాధ్యతలురేపటి సుఖం కోసంకోరికలని కాంక్షల్నిఆశల్ని మర్చిపోయివిలువల్ని వ్యక్తిత్వాన్నిపణం పెట్టిందిరేపటి శాంతి కోసంమరి…నిన్నటి రేపు నేడు కాదా?వస్తుందో రాదో తెలియనిరేపటి కోసంఏమిటీ ఈ తాపత్రేయంమిత్రమా!రేపటి కోసంనువ్వు చేయాల్సిందినేటి నిర్మాణం
-
నిద్ర బరువయ్యింది
నిశిరాతిరి నిద్ర రాక ఆరు బయట నులక మంచం మీద పడుకొని నల్లటి ఆకాశంలో తెల్లటి చుక్కలు లెక్కపెడుతూ నిద్ర లోకి జారుదామనుకుంటే నులక మంచం పట్టి మంచం అయ్యింది పట్టి మంచం పరుపు అయ్యింది నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు పై పెంకుల మధ్యలోంచి నక్షత్రాలు చూస్తూ నిద్ర లోకి జారుదామనుకుంటే పెంకులు రేకులు అయినాయి రేకులు డాబా అయ్యింది నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు గూట్లో దీపపు బుడ్డి చూస్తూ రేడియోలో…