మలచలేక నలిగిపోయి
నలగలేక వడలిపోయి
వడలలేక వాలిపోయి
వాలిపోయి నిదురపోయే
చెప్పలేక మూగపోయి
చూడలేక పారిపోయి
పారిపోయి అలిసిపోయి
అలిసిపోయి నిదురపోయే
నేటి నుండి నిదురలోకి
నిదురలోంచి కలలలోకి
కలలలోంచి కాంక్షలోకి
కాంక్షలోంచి రేపటిలోకి
రోజులు తిరిగే సంచారి
రేపటి కి దారి నేటి నుంచే