-
నిన్న నేడు రేపు!
జీవన చదరంగం లో రాజునై, మంత్రినై, బంటునైసర్వపాత్రాభినయం చేసిందిరేపటి గెలుపు కోసంనిన్నటి బాధలునేటి అవమానాలుమోసిన బాధ్యతలురేపటి సుఖం కోసంకోరికలని కాంక్షల్నిఆశల్ని మర్చిపోయివిలువల్ని వ్యక్తిత్వాన్నిపణం పెట్టిందిరేపటి శాంతి కోసంమరి…నిన్నటి రేపు నేడు కాదా?వస్తుందో రాదో తెలియనిరేపటి కోసంఏమిటీ ఈ తాపత్రేయంమిత్రమా!రేపటి కోసంనువ్వు చేయాల్సిందినేటి నిర్మాణం
-
సంచారి
మలచలేక నలిగిపోయినలగలేక వడలిపోయి వడలలేక వాలిపోయి వాలిపోయి నిదురపోయే చెప్పలేక మూగపోయి చూడలేక పారిపోయి పారిపోయి అలిసిపోయిఅలిసిపోయి నిదురపోయే నేటి నుండి నిదురలోకి నిదురలోంచి కలలలోకి కలలలోంచి కాంక్షలోకి కాంక్షలోంచి రేపటిలోకి రోజులు తిరిగే సంచారిరేపటి కి దారి నేటి నుంచే
-
నీ ప్రశ్నలు నీవే
This post is also available in English నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటే కలిగేది ఆనందమా…నిన్ను నువ్వు మోసం చేసుకుంటే కలిగేది చైతన్యమా…సమస్యలకు ఆటంకాలకు భయపడటమే ప్రతిస్పందనా… నువ్వు మెచ్చి ఎంచుకున్న మార్గం లో నడవటానికి భయమెందుకుదారిలో ముళ్లు ఉంటాయనా, ఉన్నాయనా…కొత్త మార్గం నిర్మించాలంటే …దారిని శుభ్రం చేయవలసిందే… భయాగ్ని లో నిన్ను నువ్వు దహించుకోకు…దానిని జ్యోతి లాగా మార్చి ముందుకు చూడు…సత్యాసత్యాలలో… శాంతి సంతోషాలు లేవు…సత్యాసత్యాలు భౌతికాంశాలు… కేవలం నిన్ను నడిపించే ఇంధనాలు మాత్రమే…శాంతి…