నీ ప్రశ్నలు నీవే

This entry is part 3 of 3 in the series నిత్య సంచారి

This post is also available in English

నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటే కలిగేది ఆనందమా...
నిన్ను నువ్వు మోసం చేసుకుంటే కలిగేది చైతన్యమా...
సమస్యలకు ఆటంకాలకు భయపడటమే ప్రతిస్పందనా...

నువ్వు మెచ్చి ఎంచుకున్న మార్గం లో
నడవటానికి భయమెందుకు
దారిలో ముళ్లు ఉంటాయనా, ఉన్నాయనా...
కొత్త మార్గం నిర్మించాలంటే ...
దారిని శుభ్రం చేయవలసిందే...
భయాగ్ని లో నిన్ను నువ్వు దహించుకోకు...
దానిని జ్యోతి లాగా మార్చి ముందుకు చూడు...

సత్యాసత్యాలలో... శాంతి సంతోషాలు లేవు...
సత్యాసత్యాలు భౌతికాంశాలు... కేవలం నిన్ను నడిపించే ఇంధనాలు మాత్రమే...
శాంతి సుఖాలు... అంతర్గతాంశాలు...అవి నిన్ను నిర్మించే సాధనాలు

అవి కలిపి కలవరపడకు సంచారి... విడతీసి ముందుకు సాగు
...నీ గమ్యాన్ని నిర్దేశించేవి నీ విలువలు మాత్రమే
Series Navigation<< సంచారి