జీవన చదరంగం లో
రాజునై, మంత్రినై, బంటునై
సర్వపాత్రాభినయం చేసింది
రేపటి గెలుపు కోసం
నిన్నటి బాధలు
నేటి అవమానాలు
మోసిన బాధ్యతలు
రేపటి సుఖం కోసం
కోరికలని కాంక్షల్ని
ఆశల్ని మర్చిపోయి
విలువల్ని వ్యక్తిత్వాన్ని
పణం పెట్టింది
రేపటి శాంతి కోసం
మరి...
నిన్నటి రేపు నేడు కాదా?
వస్తుందో రాదో తెలియని
రేపటి కోసం
ఏమిటీ ఈ తాపత్రేయం
మిత్రమా!
రేపటి కోసం
నువ్వు చేయాల్సింది
నేటి నిర్మాణం