-
పువ్వు నేర్పిన పాఠం
చీకటిలో శాంతి ఉందా వెలుగులో ఉత్తేజం ఉందా అన్నీ నీలోనే ఉన్నాయి అన్నీ నీ ఆలోచనలోనే ఉన్నాయి ఆలోచన నీ నుంచే వచ్చింది అది… నీ సృష్టి అది… నిజం కాదు … శాశ్వతమూ కాదు ప్రకృతి.. ఈ విషయాన్ని ప్రతీక్షణం చెపుతున్నా మన సృష్టి… మనని గుడ్డివాడిని, చెవిటివాడిని చేస్తోంది పువ్వు… మొగ్గ తొడిగి, వికసించి సుగంధాన్ని ఇచ్చి, వడలిపోతుంది అలాగే… మనం వచ్చిన పని చేసుకొని వెళ్లిపోవటమే!
-
తోడు రావే మనసా!
తోడు రావే మనసా జయిద్దాం ఈ ప్రపంచాన్ని శరీరం లేని నీకు వాంఛ ఎందుకు దేహం ఉన్న నాకు వేదనెందుకు భావాలు నీకెందుకు బాధలు నాకెందుకు తోడు రావే మనసా జయిద్దాం ఈ ప్రపంచాన్ని నీకొచ్చిన కోపం నిన్ను నాకు దగ్గర చేసింది నాకొచ్చిన కోపం ప్రపంచాన్ని నాకు దూరం చేసింది ఆకలి లేని నీకు కోపమెందుకు కడుపు కాల్చే కోపం నాకెందుకు తోడు రావే మనసా జయిద్దాం ఈ ప్రపంచాన్ని కళ్లు లేని నీకు వెలుగెందుకు…