తోడు రావే మనసా
జయిద్దాం ఈ ప్రపంచాన్ని
శరీరం లేని నీకు వాంఛ ఎందుకు
దేహం ఉన్న నాకు వేదనెందుకు
భావాలు నీకెందుకు
బాధలు నాకెందుకు
తోడు రావే మనసా
జయిద్దాం ఈ ప్రపంచాన్ని
నీకొచ్చిన కోపం నిన్ను నాకు దగ్గర చేసింది
నాకొచ్చిన కోపం ప్రపంచాన్ని నాకు దూరం చేసింది
ఆకలి లేని నీకు కోపమెందుకు
కడుపు కాల్చే కోపం నాకెందుకు
తోడు రావే మనసా
జయిద్దాం ఈ ప్రపంచాన్ని
కళ్లు లేని నీకు వెలుగెందుకు
చీకటిలోని నాకు కళ్ళేందుకు
వాక్కులేని నీకు జ్ఞానమెందుకు
తెలివి లేని నాకు మాటలెందుకు
తోడు రావే మనసా
జయిద్దాం ఈ ప్రపంచాన్ని