చీకటిలో శాంతి ఉందా
వెలుగులో ఉత్తేజం ఉందా
అన్నీ నీలోనే ఉన్నాయి
అన్నీ నీ ఆలోచనలోనే ఉన్నాయి
ఆలోచన నీ నుంచే వచ్చింది
అది… నీ సృష్టి
అది… నిజం కాదు
… శాశ్వతమూ కాదు
ప్రకృతి.. ఈ విషయాన్ని ప్రతీక్షణం చెపుతున్నా
మన సృష్టి… మనని
గుడ్డివాడిని, చెవిటివాడిని చేస్తోంది
పువ్వు… మొగ్గ తొడిగి, వికసించి
సుగంధాన్ని ఇచ్చి, వడలిపోతుంది
అలాగే… మనం వచ్చిన పని చేసుకొని
వెళ్లిపోవటమే!