Tag: తెలుగు

  • స్నేహామృతం

    స్నేహామృతం

    గెలుపు లో ఓటమి లో  కష్టం లో సుఖం లో  దుఃఖం లో యుద్దం లో  తోడున్న జతగాడా  నీకు నేను ఏమీ ఇవ్వగలను  నా స్నేహం తప్ప!

  • నిన్న నేడు రేపు!

    నిన్న నేడు రేపు!

    జీవన చదరంగం లో  రాజునై, మంత్రినై, బంటునై సర్వపాత్రాభినయం చేసింది రేపటి గెలుపు కోసం నిన్నటి బాధలు నేటి అవమానాలు మోసిన బాధ్యతలు రేపటి సుఖం కోసం కోరికలని కాంక్షల్ని ఆశల్ని మర్చిపోయి విలువల్ని వ్యక్తిత్వాన్ని పణం పెట్టింది రేపటి శాంతి కోసం మరి… నిన్నటి రేపు నేడు కాదా? వస్తుందో రాదో తెలియని రేపటి కోసం ఏమిటీ ఈ తాపత్రేయం మిత్రమా! రేపటి కోసం నువ్వు చేయాల్సింది నేటి నిర్మాణం

  • నిద్ర బరువయ్యింది

    నిద్ర బరువయ్యింది

    నిశిరాతిరి నిద్ర రాక   ఆరు బయట నులక మంచం మీద పడుకొని  నల్లటి ఆకాశంలో తెల్లటి చుక్కలు లెక్కపెడుతూ నిద్ర లోకి జారుదామనుకుంటే నులక మంచం పట్టి మంచం అయ్యింది  పట్టి మంచం పరుపు అయ్యింది నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు పై పెంకుల మధ్యలోంచి  నక్షత్రాలు చూస్తూ   నిద్ర లోకి జారుదామనుకుంటే పెంకులు రేకులు అయినాయి  రేకులు డాబా అయ్యింది  నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు గూట్లో దీపపు బుడ్డి చూస్తూ రేడియోలో…

  • పువ్వు నేర్పిన పాఠం

    పువ్వు నేర్పిన పాఠం

    చీకటిలో శాంతి ఉందా వెలుగులో ఉత్తేజం ఉందా అన్నీ నీలోనే ఉన్నాయి అన్నీ నీ ఆలోచనలోనే ఉన్నాయి ఆలోచన నీ నుంచే వచ్చింది అది… నీ సృష్టి అది… నిజం కాదు … శాశ్వతమూ కాదు ప్రకృతి.. ఈ విషయాన్ని ప్రతీక్షణం చెపుతున్నా మన సృష్టి… మనని గుడ్డివాడిని, చెవిటివాడిని చేస్తోంది పువ్వు… మొగ్గ తొడిగి, వికసించి సుగంధాన్ని ఇచ్చి, వడలిపోతుంది అలాగే… మనం వచ్చిన పని చేసుకొని వెళ్లిపోవటమే!

  • తోడు రావే మనసా!

    తోడు రావే మనసా!

    తోడు రావే మనసా జయిద్దాం ఈ ప్రపంచాన్ని శరీరం లేని నీకు వాంఛ ఎందుకు దేహం ఉన్న నాకు వేదనెందుకు భావాలు నీకెందుకు బాధలు నాకెందుకు తోడు రావే మనసా జయిద్దాం ఈ ప్రపంచాన్ని నీకొచ్చిన కోపం నిన్ను నాకు దగ్గర చేసింది నాకొచ్చిన కోపం ప్రపంచాన్ని నాకు దూరం చేసింది ఆకలి లేని నీకు కోపమెందుకు కడుపు కాల్చే కోపం నాకెందుకు తోడు రావే మనసా జయిద్దాం ఈ ప్రపంచాన్ని కళ్లు లేని నీకు వెలుగెందుకు…

  • ఉల్లి అట్టు: స్నేహం మరియు రుచుల కథ

    ఉల్లి అట్టు: స్నేహం మరియు రుచుల కథ

    ఈ కథని మీరు ఆంగ్లం లో చదవాలి అనుకుంటే ఇక్కడ చూడండి Culinary Quests: A Tale of Friendship and Flavours సాయంకాలం ఆరు గంటలు  అయ్యింది  విపరీతమైన తలనొప్పి, ఆకలిగా ఉంది, టీ తాగుదామని  ఇంటికి వెళుతూ దారిలో ఉన్న హోటల్ దగ్గర ఆగాను.  సైకిల్ స్టాండ్ లో పెట్టి లోపలి కి వచ్చాను. తలుపు పక్కనే ఒక బల్ల వేసుకొని ఒక లావుపాటి మనిషి లావు  కళ్లద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు.  “టోకెన్…